ABHISHEK SHARMA: రోహిత్ శర్మను దాటేసిన అభిషేక్ శర్మ
ఒక క్యాలెండర్ సంవత్సరంలో T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత బ్యాట్స్‌మెన్‌లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యూసుఫ్ పఠాన్, సూర్యకుమార్ యాదవ్‌లను అభిషేక్ శర్మ అధిగమించి రెండవ స్థానానికి చేరుకున్నాడు.

ఒక సంవత్సరంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యూసుఫ్ పఠాన్, సూర్యకుమార్ యాదవ్‌లు ఒక్కొక్కరు మూడు సార్లు డకౌట్ కాగా అభిషేక్ 2026వ సంవత్సరంలో ఈ విధంగా నాలుగు సార్లు అవుట్ అయ్యాడు.

టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ సున్నా పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అభిషేక్ వరుసగా యుఎస్ఏ, పాకిస్తాన్ జట్లపై ఒకసారి, న్యూజిలాండ్ సిరీస్‌లో రెండు సార్లు డకౌట్ అయ్యాడు. మొత్తం మీద నాలుగు సార్లు ఒక క్యాలెండర్ ఇయర్ లో డకౌటయై రెండో స్థానానికి చేరుకున్నాడు.

ఆఖరి ఆరు ఇన్నింగ్స్ వివరాలు.. 0(1), 68 (20), 0(1), 30(16), 0(1), 0(4). మొత్తం మీద 98 పరుగులు చేశాడు.