ABHISHEK SHARMA: 6 మ్యాచ్ లో 4 సార్లు డకౌట్

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్ సమస్యతో సతమతమవుతున్నాడు.
టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో వరుసగా డకౌట్‌లు కావడం అతడిపై తీవ్రమైన ఒత్తిడిని పెరుగుతుంది. టీ20 వరల్డ్‌కప్‌లో అభిషేక్ వరుసగా యుఎస్ఏ, పాకిస్తాన్ జట్లపై  డకౌట్లు కావడం విశేషం. ఆడిన చివరి ఆరు టీ20 మ్యాచ్‌లలో నాలుగు సార్లు సున్నాకే అవుట్ కావడం విశేషం.

అభిషేక్‌కు ఇది తాత్కాలిక ఫేజ్ మాత్రమే. ఇలాంటి పరిస్థితులు ప్రతి క్రికెటర్ జీవితంలో వస్తాయి. అతడు కాస్త ఓపిక పట్టాలి.  గేమ్ లో కొన్ని బంతులని ఆడుతూ కాస్త సమయం  గడపాలి.  అలా చేస్తే మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు” అని రవిశాస్త్రి అన్నాడు.

హై రిస్క్ – హై రివార్డ్ విధానంలో ఆడే ఆటగాడిగా, కొన్నిసార్లు తొందరగా అవుట్ కావడం సహజమని రవిశాస్త్రి  తెలిపాడు. కొన్ని బంతులు ఆడి సెటిల్ అయిన తర్వాత భారీ షాట్లు ఆడే సామర్థ్యం అభిషేక్ ఉండటంతో అతడు మొదట కొన్ని డాట్ బాల్స్ ఎదుర్కొని, ఆ తర్వాత వాటిని సిక్సర్లు, ఫోర్లుగా మార్చగలడు. అది అతడి ప్రత్యేకత” అని శాస్త్రి చెప్పాడు.

అభిషేక్ శర్మ ఆఖరి ఆరు టీ20 ఇన్నింగ్స్‌లను ఒకసారి పరిశీలిస్తే..టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ సున్నా పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఆఖరి ఆరు ఇన్నింగ్స్ వివరాలు.. 0(1), 68 (20), 0(1), 30(16), 0(1), 0(4).   మొత్తం మీద 98 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో రెండు సార్లు డకౌట్ అయ్యాడు.

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button