విద్యుత్ సమస్యల పరిష్కారానికి ముందడుగు
కొత్తగా బైపాస్ రోడ్డు ఏర్పాటు కావడంతో పాటు వార్డు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, గతంలో ఏర్పాటు చేసిన పాత ట్రాన్స్ఫార్మర్లు, ఎల్టి (LT) లైన్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించారు.

24వ వార్డులో విద్యుత్ సమస్యల పరిష్కారానికి ముందడుగు: రూ. 2 లక్షల నిధులు మంజూరు..!
హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో ఏళ్ల నాటి విద్యుత్ సమస్యలకు మోక్షం లభించనుంది. కొత్తగా బైపాస్ రోడ్డు ఏర్పాటు కావడంతో పాటు వార్డు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, గతంలో ఏర్పాటు చేసిన పాత ట్రాన్స్ఫార్మర్లు, ఎల్టి (LT) లైన్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించారు.
క్షేత్రస్థాయి పరిశీలన – తక్షణ స్పందన..! విద్యుత్ శాఖ ఎస్ సీ (sc) శ్రీనివాస్
గురువారం నాడు విద్యుత్ శాఖ ఎస్ సీ (sc) శ్రీనివాస్,ఏఈ (AE) రాంప్రసాద్ లతో కలిసి మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, 24వ వార్డు కౌన్సిలర్ యడ్ల విజయ్ కుమార్, 19 వ వార్డు కౌన్సిలర్ వల్లభదాస్ కృష్ణ తదితరులు వార్డులో పర్యటించారు. విద్యుత్ లైన్ల మార్పు, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచడంపై చర్చించారు.
చైర్మన్ విన్నపానికి సానుకూలంగా స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు, తక్షణమే సమస్య పరిష్కారానికి రూ. 2 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
*మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశానుసారం విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది మున్సిపల్ చైర్మన్ వార్డు కౌన్సిలర్లు
వార్డులో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఏయే లైన్లు మార్చాలి, ఎక్కడ కొత్త ట్రాన్స్ఫార్మర్లు అవసరమో గుర్తించి మొదటి అడుగు వేశాం.సమస్యను విన్నవించగానే వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసిన విద్యుత్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హర్షం వ్యక్తం చేస్తున్న వార్డు ప్రజలు..!
చాలా కాలంగా వేధిస్తున్న లో-వోల్టేజ్, విద్యుత్ అంతరాయాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుండటంతో 24వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ మరియు కౌన్సిలర్ల చొరవను వారు కొనియాడుతున్నారు.



