కొండ దిగిన కోడి… ఇక వారికి పండగే..!

కొండేక్కిన కోడి రేటు మాత్రం మెల్లగా దిగి వస్తుంది. ప్రస్తుతం చికెన్ రేటు మార్కెట్లో 270 కిలోగా అమ్మకాలు జరుగుతున్నాయి

 *వంద రూపాయలు తగ్గిన చికెన్ రేటు* 

 

 *కిలో 270 కి… బ్రాయిలర్ చికెన్..* 

 

మధిర మార్చి 30 నిజం చెపుతాం

ఈ మధ్యకాలంలో పౌల్ట్రీ కోడి మాంసము రేటు గణనీయంగా పెరగడంతో చికెన్ ప్రియులకు ఇది పెద్ద ఇబ్బందిగానే మారింది. అంతగా కొండేక్కిన కోడి రేటును చూసి అయ్యో అంటూ తినకుండా మానుకున్న రోజులు ఉన్నాయి.

ఇక ఇప్పుడిప్పుడే కొండేక్కిన కోడి రేటు మాత్రం మెల్లగా దిగి వస్తుంది. ప్రస్తుతం చికెన్ రేటు మార్కెట్లో 270 కిలోగా అమ్మకాలు జరుగుతున్నాయి.

 

 *ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు.. కోళ్ల పెంపకం, లభ్యతను బట్టి ధరలు..* 

 

చికెన్ లవర్స్ కు ఇది నిజంగా గుడ్ న్యూసే. గతవారం భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఈ వారం అమాంతం తగ్గిపోయాయి. మార్చి నెల ఆరంభంలో కిలో చికెన్ ధర రూ.360- రూ.400 పలికింది. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో కోళ్లు చనిపోవడం, వాటి దాణా ఖర్చులు పెరగడంతో కోళ్ల ఫారమ్ల యజమానులు ధరలను పెంచారు.

ఇదే సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కూడా ఉండటంతో చికెన్ కు గిరాకీ ఏర్పడింది. వెరసి స్కిన్ లెస్, నార్మల్ చికెన్ ధర కూడా ఆల్ టైమ్ రికార్డుకు చేరింది.

గతవారం కేజీ చికెన్ ధర ఏకంగా రూ.400కు చేరడంతో.. చికెన్ ప్రియులంతా సీ ఫుడ్ వైపు మళ్లారు. వారంరోజుల తర్వాత కిలో చికెన్ రేటు ఏకంగా రూ.100 వరకూ తగ్గింది. హైదరాబాద్ లో నేడు స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.270గా ఉండగా.. అటు వరంగల్ లోనూ అదే ధర కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంలో మాత్రం రూ.300-350 పలుకుతోంది. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, కోళ్ల పెంపకం, లభ్యతను బట్టి ధరలు మారుతుంటాయని వ్యాపారస్తులు తెలిపారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button