మఠంపల్లి గురుకులాలో 98.3 శాతం ఉత్తీర్ణత..!
మండల టాపర్లుగా కావేరి, జిషిత..!

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో మఠంపల్లి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో ఈ పాఠశాల విద్యార్థులు ఏకంగా 98.3 శాతం ఉత్తీర్ణత సాధించి మండలంలోనే అగ్రగామిగా నిలిచారు.
సత్తా చాటిన విద్యార్థులు:
ఎంపీసీ (MPC) విభాగంలో విద్యార్థిని వి. కావేరి 470 మార్కులకు గాను 458 మార్కులు సాధించి మండల ప్రథమ స్థానంలో నిలిచారు. అదేవిధంగా బైపీసీ (BiPC) విభాగంలో ఆకారపు జిషిత 440 మార్కులకు గాను 430 మార్కులతో సత్తా చాటి మండల టాపర్‌గా నిలిచినట్లు ప్రిన్సిపాల్ సిహెచ్. సుష్మ వెల్లడించారు.
గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నిరంతరం ప్రత్యేక తరగతులు నిర్వహించి, నాణ్యమైన శిక్షణ అందించడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులను పాఠశాల అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంతటి ప్రతిభ కనబరచడంపై స్థానికులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



