యుద్ధ ఉద్రిక్తతలకు 5 రోజుల విరామం…
ఇరాన్‌తో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం ప్రకటించారు. గత రెండు రోజులుగా ఇరాన్ ప్రతినిధులతో చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.

- యుద్ధ ఉద్రిక్తతలకు 5 రోజుల విరామం…
ట్రంప్ కీలక ప్రకటనఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో సైనిక దాడులు తాత్కాలికంగా వాయిదా
ఇరాన్‌తో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం ప్రకటించారు. గత రెండు రోజులుగా ఇరాన్ ప్రతినిధులతో చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, ఇంధన వనరులపై జరపాల్సిన సైనిక దాడులను తాత్కాలికంగా 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయం యుద్ధ పరిస్థితుల్లో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న చర్చల ఫలితాల ఆధారంగా యుద్ధాన్ని కొనసాగించాలా లేదా పూర్తిగా నిలిపివేయాలా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ 5 రోజుల విరామం శాంతి చర్చలకు అవకాశాన్ని కల్పించవచ్చని అంతర్జాతీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రపంచ దేశాలు కూడా ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. యుద్ధం మరింత విస్తరించకుండా ఉండేందుకు ఈ చర్చలు కీలకంగా మారనున్నాయి.
శ్రీనివాస్ నాయక్ స్టేట్ బ్యూరో, నిజం న్యూస్