కల్వకుర్తి ఎత్తిపోతలతో వలసలు ఆగాయి

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
తెలంగాణ ప్రజా ప్రభుత్వం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 2 తేదీన గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. గోపాల్ పేట్ మండలం జయన్న తిరుమలాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు.చిన్నారెడ్డి మాట్లాడుతూ2005 కన్నా ముందు జయన్న తిరుమలాపురం గ్రామం ప్రజలు వలసలు వెళ్లేవారని అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యాన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నుండి సాగునీళ్లు వదలడంతో ఈ గ్రామ ప్రజలు పాడి పరిశ్రమ ,పంటలు పండించుకోవడంతో ఆర్థికంగా ఎదుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడేజయన్న తిరుమలాపురం గ్రామంలో గ్రామపంచాయతీ, సబ్ స్టేషన్, బస్ షెల్టర్, వెటర్నరీ హాస్పిటల్, దేవాలయాల పునర్నిర్మాణం, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటివి నిర్మించుకున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడినంక ఉచిత ఆర్టీసీ బస్సు, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ , రెండు లక్షల రుణమాఫీ, క్వింటాల్ సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ హైడ్రా ద్వారా చెరువుల పునర్నిర్మాణం , డ్రగ్స్ ను అరికట్టుట, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. గ్రామంలో విద్యార్థులను తల్లిదండ్రులు ఉన్నతంగా చదివించినప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామంలో అనేక బెల్ట్ షాపులు ఉన్నాయి వాటిని మహిళలే బంద్ చేయించాలని మహిళలకు విన్నవించారు. సంగారెడ్డి లో రుద్రారం గ్రామం, వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం మాచనూరు గ్రామాలు అభివృద్ధి చెందిన గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో జయన్న తిరుమలాపురం గ్రామం అభివృద్ధి చెంది ఆదర్శ గ్రామంగా నిలవాలని గ్రామస్తులను కోరారు.కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్యలు ఉన్న ప్రజా ప్రభుత్వం వాటిని పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తుందని అన్నారు. గ్రామ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారికి ఇస్తామని అన్నారు. గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి అనేక మంది రైతులు సానుకూలంగా ఉన్నారని భవిష్యత్తులో గ్రామ రైతులు ఆరోగ్యంగా ఆర్థికంగా నిలదొక్కుకోబోతున్నారని అన్నారు.కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, గ్రామ సర్పంచ్ జ్యోతి గోపాల్, ఉపసర్పంచ్ రాజు, అమరేందర్ రెడ్డి,గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



