AP ఇంటర్మీడియట్ ఫలితాలు 2022 నేడు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు జూన్ 22 (బుధవారం)న విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ని సందర్శించాలని సూచించారు, ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా పూర్తయినట్లు తెలిసింది. మే 6 నుంచి మే 24 వరకు ప్రథమ, ద్వితీయ పరీక్షలు నిర్వహించగా, రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Also Read:ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో గౌహతి హోటల్‌కు చేరుకున్న 40 మంది ఎమ్మెల్యేలు
మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు పటిష్ట ఏర్పాట్లతో మే 24 వరకు పరీక్షలను పూర్తి చేసింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో చోటు చేసుకున్న ఘటనల దృష్ట్యా ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే పరీక్ష కేంద్రాల్లోని అన్ని గదులకు బయట సీసీ కెమెరాలు అమర్చారు.