ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో గౌహతి హోటల్‌కు చేరుకున్న 40 మంది ఎమ్మెల్యేలు

శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు, ఏక్నాథ్ షిండేతో కలిసి బుధవారం అస్సాంలోని గౌహతి చేరుకున్నారు. సీనియర్ మంత్రి ఏక్‌నాథ్ షిండే మరియు పలువురు ఇతర శివసేన ఎమ్మెల్యేలు పార్టీ విధానాలు మరియు పొత్తులపై తిరుగుబాటు చేశారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.