వికలాంగుని మంత్రి జగదీష్ రెడ్డి చేయూత

మరో మారు మంత్రి జగదీషుడి దాతృత్వం!

సమస్య చెప్పుకునెందుకు వచ్చిన వికలాంగుని కుంటుంబానికి కొండత అండ.

ట్రై సైకిల్, డబల్ బెడ్ రూమ్ ఇల్లు హామీతో పాటు ఆర్థిక సాయం..

నిరంతర ఆదాయం కోసం ఆ కుటుంబానికి భరోసా ఇచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి.

ఆశతో వచ్చిన తమకు కొండంత అండగా నిలిచిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు.

సూర్యాపేట ప్రతినిధి జూన్ 21 నిజం న్యూస్

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మరోమారు దాతృత్వాన్ని చాటుకున్నారు. సమస్య చెప్పుకునెందుకు వచ్చిన వికలాంగుని కుంటుంబానికి కొండత అండగా నిలిచి.. వారి సమస్య తెలుసుకుని చలించి పోయారు. వెంటనే కుటుంబానికి అన్నివిధాలుగా సాయమందించారు. గత ఏడాది అనారోగ్యం కారణంగా రెండు కాళ్లు కోల్పోయిన నజీర్ పాషా అతని భార్య సాజిత తో కలిసి మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే ప్రజల సమస్యలు తీసుకుంటూ బిజీగా ఉన్నప్పటికీ వారు లోపలికి వచ్చే క్రమంలో పరిస్థితిని గమనించిన మంత్రి జగదీష్ రెడ్డి తానే స్వయంగా వారివద్దకు వెళ్ళాడు. జరిగిన సంఘటనతో పాటు ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే బాధితుడికి ట్రై సైకిల్, డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని హామీతో పాటు తక్షణమే ఆర్థిక సాయం అందించారు. అలాగే కుటుంబానికి నిరంతర ఆదాయం కోసం ఏదైనా మార్గం చూపుతామని మంత్రి జగదీష్ రెడ్డి భరోసా ఇచ్చారు. తమ సమస్యను విన్నవించుకుందామని ఆశతో వచ్చిన తమకు కొండంత అండగా నిలిచిన మంత్రి జగదీష్ రెడ్డికి ఆ కుటుంబసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.