నిరంతర యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం

నిరంతర యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం…….. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జూన్ 21(నిజం న్యూస్)
8వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నాడు భువనగిరి పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ స్కూల్ లో ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిధిగా హాజరై యోగ అభ్యాసం చేసారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా జీవించేందుకు ప్రతి ఒక్కరు యోగ సాధన చేయాల్సిన అవసరం ఉన్నదని ,యోగ ఒక్క రోజు చేస్తే సరిపోదని క్రమం తప్పకుండ ప్రతిరోజూ యోగ చేస్తూ ఉండాలని,ఇది ఒక బహుమతిగా భావించాలని యోగ ద్వారా ఆరోగ్యం తో పాటు మానసిక ప్రశాంతత ఉంటుందని దీర్ఘ కాలిక జబ్బులైన బి. పి. ,షుగర్, వంటి వ్యాధులు నయం అవుతాయని యోగ చేయకపోతే వయసు పెరిగే కొద్దీ ఫిజియోతెరపి లాంటివి చేయించవల్సి వస్తుందని, యోగ చేసే వారికి ఈ అవసరం రాదని, పిల్లలు యోగ చేయడం తో జ్ఞానం పెరుగుతుందని కలెక్టర్ అన్నారు.

Also Read:UNSCలో భారతీయుడిని ఉగ్రవాదిగా జాబితా చేర్చడాన్ని వ్యతిరేకించిన 5 దేశాలు

యోగ చేస్తూ ఆరోగ్యాంగా ఉన్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ (సోషల్ వర్కర్ ) జయ ప్రకాష్ ను ఈ సందర్బంగా కలెక్టర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఆయుష్ ఇంచార్జ్ డా,, పృథ్వి రాజ్, పాఠశాల ప్రిన్సిపల్ శీలం శ్రీనివాస్, జిల్లాలోని ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్, పేరామెడికల్ సిబ్బంది, రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.