రైలు ఢీకొని మహిళ & ఇద్దరు పిల్లలు మృతి

నల్గొండ: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నడికుడి రైల్వేస్టేషన్‌ సమీపంలో సోమవారం రాత్రి రైలు ఢీకొని ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు మరణించిన దురదృష్టకర సంఘటన. మృతులు నల్గొండ పట్టణం చైతన్యపురి కాలనీకి చెందిన రమ్య(28), ఆమె కుమారుడు రిషిక్ రెడ్డి(8), కూతురు హన్సిక(6). రాత్రి 7.40 గంటలకు నడికుడి సమీపంలో రైల్వే ట్రాక్‌ దాటుతుండగా ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read:ప్రభుత్వ పాఠశాలకు భలే క్రేజ్

మృతుల మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం పోలీసులు సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించడంతో మృతుల కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం నల్గొండ నుంచి సత్తెనపల్లికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.