ప్రభుత్వ పాఠశాలకు భలే క్రేజ్

పాఠశాలలో జోరుగా సాగుతున్న నూతన అడ్మిషన్లు.

ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు గా కనిపిస్తున్న వైనం.

తుంగతుర్తి జూన్ 21 నిజం న్యూస్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం వందల సంఖ్యలో గురుకులాల్లో ఏర్పాటు చేసి విద్యను అభ్యసిస్తున్నారు.

మన ఊరు మన బడి కార్యక్రమంలో ద్వారా పాఠశాలల్లో సకల సౌకర్యాలతో ప్రత్యేక నిధులు కేటాయించడంతో ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో అదనంగా నూతన అడ్మిషన్లు రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ALSO READ:రెండు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతం

తుంగతుర్తి మండలంలో మొత్తం 14 పాఠశాలకు మన ఊరు మన బడి లో తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ సహకారంతో పాఠశాల మౌలిక వసతులు నూతన భవనాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు . ఉండ చుట్టి వెలుగు పల్లి వెంపటి గొట్టిపర్తి తదితర గ్రామాల్లో పాఠశాలలో అదనపు నూతన భవనాలు నిధులు మంజూరై పనులు పూర్తి కావడం, ప్రారంభోత్సవం కూడా జరిగాయి దీనితో సాధ్యమైనంత వరకూ పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు పూర్తయ్యాయి.


తుంగతుర్తి వెంపటి వెలుగు పెళ్లి ప్రభుత్వ పాఠశాలలు నేడు కార్పొరేట్ పాఠశాలలకు విశాలమైన భవనాలు, ఆడుకోవడానికి ఆట స్థలాలు పచ్చని చెట్లు ,సరస్వతి విగ్రహాలతో విద్యార్ధులు మైమరిపిస్తుంది చేస్తున్నాయి.

ఏది ఏమైనా గడిచిన 10 సంవత్సరాల తో పోలిస్తే పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉచిత సంపూర్ణ భోజనం, తో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అంకితభావంతో బోధన, స్థానిక ప్రజాప్రతినిధుల కృషితో వెళ్లి విరుస్తున్నాయి. పాఠశాలల్లో ప్రత్యేక నిధులను ఎమ్మెల్యే కృషితో మంజూరు కావడం పట్ల రాజకీయాలకతీతంగా పాఠశాల అభివృద్ధికి నూతన అడ్మిషన్లకు ప్రస్తుత సంవత్సరం క్రేజ్ పెరగడంతో , విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: విరాట పర్వం OTT విడుదల

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి.
అబ్బ గాని పద్మ సత్యనారాయణ గౌడ్ వెంపటి సర్పంచ్.

గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు ప్రాథమిక పాఠశాలకు నలుమూలల గ్రామాలనుండి తన అడ్మిషన్లు రావడం చాలా సంతోషంగా ఉన్నది దీనితో నూతన విద్యార్థులకు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించాము మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వెంకటరామన్ నరసమ్మ ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేస్తున్నారు దీనితో గ్రామంలోని పాఠశాల కార్పొరేట్ పాఠశాలల్లో తలపిస్తుంది చాలా సంతోషంగా ఉన్నది పాఠశాల అభివృద్ధి లో ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని కోరారు.