ముగిసిన డీఆర్ఎం కప్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్

విశాఖపట్నం : డీఆర్ఎం కప్ జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలు ఆదివారం రైల్వే క్లబ్లో ముగిశాయి. రెండు రోజుల పాటు బాలబాలికలకు ఐదు గ్రూపులుగా పోటీలు నిర్వహించారు. ఛాంపియన్షిప్ విజేతలకు వాల్టెయిర్ డివిజనల్ రైల్వే మేనేజర్ అనుప్ సత్పతి బహుమతులు అందజేశారు.
Also Read:హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలో బంగారం ధరలు
కార్యక్రమంలో ఏడీఆర్ఎం (ఇన్ఫ్రా) సుధీర్‌కుమార్ గుప్తా, రైల్వే స్పోర్ట్స్ అధికారి ప్రదీప్ యాదవ్, అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎం హరనాథ్, స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి సహా వివిధ జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు.