దేశ రక్షణలో మిలట్రీ పాత్ర అమోఘం

సరిహద్దు చొరబాట్లను నియంత్రించేది మిలట్రీనే

ఆ వృత్తిని ఎంచుకోవడం అభినందనీయం

లెఫ్టినెంట్ గా పదోన్నతి పొందిన ఇమ్మడి పవన్ కు ఘన సన్మానం

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి, జూన్ 19 నిజం న్యూస్: దేశ రక్షణలో మిలట్రీ పాత్ర ఆమోఘమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి మిలట్రీ సరిహద్దుల్లో కాపలాగా ఉండడంతోటే మనం ఇంతటి ప్రశాంత వాతావరణంలో జీవనాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. అటువంటి వృత్తిని ఎంచుకుని దేశరక్షణలో ముందుండి పోరాడిన గోపయ్య చారి,కల్నల్ సంతోష్ బాబు ల అమరత్వం అజరమారమని ఆయన కొనియాడారు. సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగరం మండలం డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇన్.ఇమ్మడి పవన్ కు లెఫ్టినెంట్ గా పదోన్నతి పొందిన సందర్భంగా ఆయనను ఆదివారం ఘనంగా సన్మానించారు.

Also Read:చెరువులో పడి బాలుడి మృతి

దివంగత గుంటకండ్ల సావిత్రమ్మ పేరుతో ఏర్పాటు చేసిన యస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందిస్తున్న సూర్యాపేట యస్ వి కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మిలట్రీ వృత్తిని ఎంచుకున్న యువత వర్తమానానికి స్ఫూర్తినందించే విదంగా ఉండాలన్నారు.డి కొత్తపల్లి కి చెందిన పవన్ లెఫ్టినెంట్ గా పదోన్నతి పొందడం అభినందనీయమన్నారు.సరిహద్దుల్లో విదేశీ చొరబాట్లను నిర్ద్వంద్వంగా నిరోదించేది మిలట్రీ సైన్యమే నన్నారు.అటువంటి వృత్తిలో రాణిస్తూ ఉన్నత స్థానానికి చేరుకోవడం అనిర్వచనీయమైన ఘట్టంగా ఆయన అభివర్ణించ