చెరువులో పడి బాలుడి మృతి

ఆత్మకూరు ఎస్ జుాన్19 (నిజం న్యూస్): ప్రమాదవశాత్తు పడి చెరువు లో పడి బాలుడు మృతిమృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రామన్నగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులుకుటుంబ సభ్యులు తెలిపిన వివరాలప్రకారం గ్రామానికి చెందిన మున్నా గంగయ్య,యాదమ్మకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు మున్నా మహేష్ (14 ) గొర్రెల కాపరిగా ఉన్నాడు.

Also Read:డీసీఎం ఢీ కొని రాములమ్మ మృతి,మధుకు గాయాలు.

శనివారం సాయంత్రం వరకు తమ గేదెలు ఇంటికి రాలేదని చుట్టుపక్కల వెతుకగా తమ గేదెలు చెరువు లో ఉండడంతో వాటిని ఇంటికి తోలుకొచ్చేందుకు చెరువులోకి దిగి బురద లో చిక్కుకొని మృతి చెందాడని తెలిపారు. మహేష్ కు ఈత రానందున నీటిలో మునిగి మృతి చెందాడు.మహేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.