అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు

తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్.

తుంగతుర్తి జూన్ 19 నిజం న్యూస్:టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి తెలంగాణ రాష్ట్ర సమితి లో ఆదివారం రోజున హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో గొట్టిపర్తి ఎంపీటీసీ కేతిరెడ్డి లతా విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

Also Read:ఇండియన్ 2 గురించి కీలకమైన అప్‌డేట్‌ను పంచుకున్న కమల్ హాసన్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైన ఆసరా పింఛన్ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతు రుణమాఫీ రైతుబంధు రైతు బీమా దళిత బంధు వంటి పథకాలు దేశంలోనే చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు దళిత బందు స్వీకరించిన ప్రతి లబ్ధిదారుడు అభివృద్ధిలోకి రావాలని కోరారు. పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరిని అన్ని విధాలా ఆదుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
పార్టీలో చేరిన గొట్టిపర్తి గ్రామస్తులు చింతకుంట్ల వెంకన్న పరశురాములు సుధాకర్ రేణుక నరేష్ పరమేష్ ,విట్టల్, లక్ష్మి ,సంధ్య సుశీల, మంగమ్మ పిచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.