క్వింటా గంజాయిని తగలబెట్టిన పోలీసులు

11 కేసుల్లో సీజ్ చేసిన గంజాయి. కోదాడ పట్టణ PS వి 10 కేసులు, కోదాడ రూరల్ PS 1 కేసు.
కోదాడ పట్టణం బైపాస్ వెంట గల మైదానంలో గంజాయి తగలబెట్టి నిర్వీర్యం చేసిన జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ.
కార్యక్రమంలో పాల్గొన్న డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్మెన్, జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ IPS . ఎస్పీ అధ్వర్యంలో కమిటీ నిర్ణయం మేరకు గంజాయి నిర్వీర్యం.
ALSO READ: పెళ్లి బృందం ట్రక్కు బోల్తా ఐదుగురు మృతి-36 మంది గాయాలు
గంజాయి వల్ల సమాజానికి, యువతకు భంగం వాటిల్లుతుందని, నష్టం జరుగుతుందని ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా జడ్జి ఉత్తర్వుల ప్రకారం తగలబెట్టినట్లు ఎస్పీ తెలిపినారు.
ఎస్పీ వెంట DSP లు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి, CI లు నర్సింహారావు, PND ప్రసాద్, SI లు నాగభూషణ రావు, మగ్దుం అలి, రాంబాబు, సాయి ప్రశాంత్, సిబ్బంది ఉన్నారు.