ప్రతి ఇంటా మొక్కలు నాటండి

సంగారెడ్డి జిల్ల, కంగ్టి 17జూన్ (నిజం న్యూస్)
తడ్కల్ గ్రామ ప్రజలారా..చేతులెత్తి దండం పెడుతున్న ప్రతి ఇంటా మొక్కలు నాటి హరితహారాన్ని సమృద్ధి పరచాలని తడ్కల్ సర్పంచ్ మనోహర్ అన్నారు .శుక్రవారం గ్రామంలో హరితహారం మొక్కలు ఇంటింటికి మూడు మొక్కల పంపిణీ కార్యక్రమ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని రూపొందించిందని, ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ అన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, ఎంపీటీసీ, మండల కో ఆప్షన్ సభ్యుడు, వార్డు మెంబర్లు, పరిశుద్ధ కార్మికులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.