నాను మాద్రి కృష్ణా అర్జున్ రావు మృతి బిఎస్.పి.కి తీరని లోటు

చర్ల జూన్ 17 (నిజం న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఎస్ పి జిల్లా అధ్యక్షులు. నియోజకవర్గ ఇన్చార్జి నాను మాద్రి కృష్ణార్జున రావు ఆకస్మిక మృతి బి ఎస్. పి పార్టీకి తీరని లోటు. కృష్ణార్జున రావు పూర్తి పౌండేషన్ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు స్టేట్ బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన ఆయన బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో బి ఎస్ పి పార్టీ లో చేరి పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుధవారం జరిగిన పర్యటనలో ఎండను కూడా లెక్కచేయకుండా ఆయన వెంట ఉండి బహుజన రాజ్యాధికారం యాత్ర లో ఎంతో కష్టపడ్డారు. పని ఒత్తిడి కావడం తో ఆయనకు పోటు రావడంతో కొత్తగూడెం ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు వైద్య చికిత్స నిర్వహిస్తుండగా ఆయన మృతి చెందరు. ఆయన మృతి అన్ని వర్గాల వారిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనకు భార్య. కుమారుడు కూతురు ఉన్నారు