బోరబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుట అడ్మిషన్ల కోసం ఎదురుచూపులు

హైదరాబాద్ జూన్ 16 నిజం న్యూస్.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో మన ఊరు.. మన బడి కార్యక్రమంలో ప్రత్యేక నిధులు కేటాయిస్తూ, రాష్ట్రంలోని నలుమూలల ప్రభుత్వ పాఠశాలలో నిధులు కేటాయిస్తూ సమస్యలను పరిష్కరించిన తరుణంలో, 2022 విద్యా సంవత్సరానికి గాను హైదరాబాదులోని బోరబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల నూతన అడ్మిషన్ కోసం పాఠశాల ఎదుట తల్లిదండ్రులు పడిగాపులు కాస్తూ.. వేచి ఉండడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాల బలోపేతం లో ప్రజా ప్రతినిధులు, రాజకీయాలకతీతంగా స్థానికులు కృషి చేయవలసిన ఆవశ్యకత ఉందని మేధావులు, పేద విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.