అడ్డంగా దొరికిపోయిన సాయి దీప్తి నర్సింగ్ హోమ్

హాస్పిటల్ సీజ్ చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.

విచారణ జరిపి కేసు నమోదు చేయాలని సామాన్య ప్రజల డిమాండ్.

సూర్య పేట ప్రతినిధి జూన్ 14 నిజం న్యూస్.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి దీప్తి నర్సింగ్ హోమ్ హాస్పిటల్ లో ముహూర్తపు సిజరింగ్, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని సమాచారం రావడంతో వెంటనే స్పందించిన డిఎంహెచ్వో కోటాచలం ఆధ్వర్యంలో సిబ్బంది సహకారంతో సోదాలు జరగాయి. హాస్పటల్ ను డిఎంహెచ్వో సందర్శించి, సీజ్ చేయించారు. ఆ తరువాత వారి పై చర్యలకు ఆదేశించారు. ఏది ఏమైనా జరిగిన సంఘటన పట్ల పూర్తిస్థాయిలో విచారణ జరిపి క్రిమినల్ కేసు లు, నమోదు చేయాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.