ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలి

స్థానిక ఎంపీటీసీ చెరుకు సుజనా పరమేష్.
తుంగతుర్తి జూన్ 13 నిజం న్యూస్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్న తరుణంలో ,ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థుల భాగస్వామ్యం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక ఎంపిటిసి చెరుకు సృజనా పరమేష్ అన్నారు.
సోమవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మొదటి రోజున పాఠశాల విద్యార్థులకు స్వాగతం పలుకుతూ, తన వంతు బాధ్యతగా పాఠశాలలోని విద్యార్థులందరికీ నోటు పుస్తకం, పెన్నులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నతనములో తన పాఠశాలలో చదువుకొని, అవకాశం కొద్ది ఎంపీటీసీగా రావడం ప్రస్తుతం సమాజంలో పేద ప్రజలకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పాఠశాల విద్యార్థులు అందరూ కష్టపడి చదివి మంచి మార్కులు సాధించిన అప్పుడే మనను కన్న తల్లిదండ్రులకు, పాఠశాలకు గుర్తింపు లభిస్తుందని అన్నారు. పాఠశాల అభివృద్ధి లో తాను ఎల్లవేళల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కొండగడప యాకయ్య, భాస్కర్, ఎర్ర హరికృష్ణ, రమేష్, కృష్ణవేణి, తుంగతుర్తి మార్కెట్ డైరెక్టర్ గోపగాని శ్రీనివాస్ గౌడ్, దళిత బంధు కోఆర్డినేటర్ మద్దెల మహేష్, మండల యూత్ ఉపాధ్యక్షులు బొంకూరి మధు, శ్రీకాంత్, రాజు, తదితరులు పాల్గొన్నారు.