పిడుగుపాటుకు పూరిళ్లు దగ్ధం… రూ 6 లక్షల ఆస్తి నష్టం

చర్ల జూన్ 12 (నిజం న్యూస్) మండల పరిధిలోని దేవరపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉరుములతో వచ్చిన గాలివానకు పాయం నర్సమ్మ పూరిల్లు పై పిడుగు పడి కాలిపోయింది. ఒకేసారి ఇంటి నుండి మంటలు ఎగిసిపడడంతో గ్రామస్తులు దరిదాపులకు కూడా పోని పరిస్థితి ఏర్పడింది.
ALSO READ: హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబైలలో ఈరోజు పెట్రోల్,డీజిల్ ధరలు
దీంతో ఇంట్లో సామాగ్రి పూర్తిగా కాలి బూడిద అయిపోయింది సుమారు 6. లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు