సుంకరి ఆనంద్ కు 2022 ఎన్ టి ఆర్ జాతీయ అవార్డు పట్ల హర్షం

శాలిగౌరారం, జూన్ 12 నిజం న్యూస్

ది.11.06.2022 శనివారం సాయంత్రం తెలంగాణ సారస్వత పరిషత్ ,బొగ్గులకుంట హైదరాబాద్ లో డా. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను సృజన ఆర్ట్ క్రియేషన్స్ మరియు ఎస్ ఆర్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవులు, కళాకారులతో పాటు సంఘ సేవకులను 2022 ఎన్ టి ఆర్ జాతీయ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా శాలిగౌరరం మండలం ఆకారం గ్రామానికి చెందిన సామాజిక సేవకులు 2022 జాతీయ ఉగాది నంది అవార్డు గ్రహీత, సుంకరి ఆనంద్ ఎన్టీఆర్ జాతీయ అవార్డు-2022 సభకు హాజరైన పెద్దల ద్వార పురస్కారం అందజేశారు.
సుంకరి ఆనంద్ గత 12సం.ల నుండి నిరంతరాయంగా వధూవరుల పరిచయ వేదికలు నిర్వహించి స్వచ్చందంగా వేలాది పిళ్లిళ్ళు జరగడానికి దోహదపడటం వీధుల వెంట తిరిగే అనాదలైన మానసి కవికలాంగులను (పిచ్చోళ్ళ) గుర్తించి అనాధ మానసిక ఆశ్రమాలలో చేర్పించడం అమ్మ నాన్న, మాతృదేవోభవ,సత్యేశ్వర మానసిక వికలాంగుల ఆశ్రమాలతో పాటు అనురాగిని, వాత్సల్య,ఆశ్రీ, కారుణ్య సింధు లాంటి బాలబాలికల అనాధ ఆశ్రమాలకు పరోక్షంగా సహాయం చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించారు ఏది ఏమైనా అవార్డు పొందడం పట్ల గ్రామస్తులు మేధావులు యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.