225 కిలోల గంజాయి పట్టివేత

 

లారీ టూల్ కిట్స్ బాక్స్ లో గంజాయి.
ఇద్దరు వేక్తులను అదుపులోనికి తీసికినా పోలీసులు.

జీలుగుమిల్లి జూన్ 12 (నిజం న్యూస్)
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రం తాటియాకుల గూడెం. రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద శనివారం గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ చంద్రశేఖర్ తమ సిబ్బందితో వాహనాల తనిఖీ నిర్వహించరు. అనుమానాస్పదంగా ఉన్న కారు మరియు ట్రాలీ లారీ నీ ఆపి తనిఖీ చేస్తూ ఉండగా లారీ టూల్ కిట్స్ బాక్స్ లో అక్రమంగా తరలిస్తున్న ఎటువంటి 225 కేజీల గంజాయిని గుర్తించారు నిందితులను అదుపులోకి తీసుకొని జీలుగుమిల్లి మండలం తాసిల్దార్ గడ్డం ఎలీషా ఆధ్వర్యంలో వెలికితీశారు .

Also Read:విద్యుత్ తీగలు తగిలి సిఆర్పిఎఫ్ వ్యాను దగ్ధం

వీటి విలువ సుమారు 6 నుండి 10 లక్షలు రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ గంజాయి తుని నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నటువంటి ఏలూరు జిల్లా భీమడోలుకు చెందిన కొల్లు సురేష్, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన సద్దాల సాయికృష్ణ ను అరెస్ట్ చేశారు. లారీ అలాగే నిందితులు ఉన్నటువంటి కారును అదుపులోనికి తీసుకున్నారు ఈ కేసును పోలవరం సిఐ విజయబాబు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.