AP TET 2022 నోటిఫికేషన్ విడుదల

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమై వచ్చే నెల 15తో ముగుస్తుంది. ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించి, ఆగస్టు 31న పరీక్ష కీని విడుదల చేస్తామని, సెప్టెంబర్ 14న ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. TET ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం http://aptet.apcfss.inలో అందుబాటులో ఉంది. నోటిఫికేషన్, సమాచార బులెటిన్, సిలబస్, పరీక్ష తేదీలు, పరీక్ష ఫీజులు, ఆన్లైన్ పరీక్ష సూచనలను ఈ వెబ్సైట్ ద్వారా చూడవచ్చని పాఠశాల విద్యా కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు టెట్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.