సదాచార్ ట్రస్ట్ తో నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు, నూతన వస్త్రములు అందజేత

సదాచార్ ట్రస్ట్ తో నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు, నూతన వస్త్రములు అందజేత
సదా చార్ ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్త
సూర్యాపేట ప్రతినిధి, జూన్ 7 నిజం న్యూస్.
భావితరాలకు మన సనాతన ధర్మాన్ని తెలియచేయటం తో పాటు ఆర్ధికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడమే సదాచార్ ట్రస్ట్ లక్ష్యమని ట్రస్ట్ కన్వీనర్ ఈగా దయాకర్ గుప్త అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రం లోని విద్యానగర్ గల సదాచార్ ట్రస్ట్ సేవా మందిరం లో ఆర్ధికంగా వెనుకబడిన సూర్యాపేట మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన రాపాక రాజసింహ, సుమంగళి కుమార్తె వైష్ణవి వివాహం నిమిత్తం దాతలు గుండా కృష్ణమూర్తి, జ్యోతి ల ఆర్ధిక సహకారం తో మంగళసూత్రం, మట్టెలు, నూతన వస్త్రములు అందచేసి మాట్లాడరు.
శ్రీ వామనాశ్రమ మహా స్వామిజీ, హలధిపూర్, కర్ణాటక వారి ఆశీర్వాదంతో, ట్రస్ట్ అధ్యక్షులు సాయి ఈశ్వర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో దాతల సహకారం తో తెలంగాణ లో ఇప్పటి వరకు ఆర్ధికంగా వెనుకబడిన పెండ్లి కుమార్తెలకు 77 మంది వధువులకు ఇచ్చామని, ఒక్క సూర్యాపేట లోనే 44 మంది వధువులకు పుస్తె, మట్టెలతో పాటు నూతన వస్త్రములు అందించినట్టు తెలిపారు.
ఆర్ధికంగా వెనుకబడిన హిందూ మతం లోని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు వివాహం చేసుకునే వధువు, పెండ్లి పత్రిక, తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలతో మా కార్యాలయం లో ముందుగా సంప్రదించాలని తెలిపారు, ఇట్టి సేవా కార్యక్రమానికి దాతలు ఎవరైనా సహకారం అందిచాలనుకునే వారు పుస్తె, మట్టెలు, మీరు తయారు చేపించి స్వయంగా వధువుకు అందించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమం లో ట్రస్ట్ సభ్యులు, దాతలు మిర్యాల శివకుమార్, కవిత, గుండా కృష్ణమూర్తి, జ్యోతి, ఈగా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు..