వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుచేయాలంటూ మంత్రులను నిలదీసిన ఆర్యవైశ్యులు

 

తెలంగాణలో వెయ్యి కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.

తెలంగాణ ఆర్యవైశ్య సాధన సమితి నాయకులు ప్రేమ్ గాంధీ.

హైదరాబాద్ జూన్ 6 నిజం న్యూస్

లక్డికపుల్ లోని వాసవీ సేవ కేంద్రంలో జరిగిన పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్ దామోదర్ గుప్త జన్మదిన వేడుకలకు హాజరైన హోంశాఖ మంత్రి మహమూద్ అలీ , సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , ఎమ్మెల్యే ముఠా గోపాల్ , ఎమ్మెల్సీ దయానంద గుప్త
మంత్రులు మాట్లాడుతుండగా అడ్డుకున్న తెలంగాణ ఆర్య వైశ్య నాయకులు.
ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య సాధన సమితి నాయకులు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ,
ఎన్నికల సమహాయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేవలం ప్రభుత్వం ఆర్యవైశ్యుల ను ఓటు బ్యాంకు గానే చూసిందని విమర్శించారు. సమాజంలో ఆర్యవైశ్యుల పై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నట్లు తెలిపారు.

త్వరలో ఆర్య వైశ్యులను ఐక్య చేసి, ఆర్యవైశ్య జేఏసీ ఏర్పాటు చేసి, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు నిధులు మంజూరు అయ్యేవిధంగా, హైదరాబాద్ నగరంలో మహాసభ నిర్వహిస్తాం అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేద ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే , మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని వారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బుస్సు శ్రీనివాస్ , తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ సాధన సమితి నాయకులు పాల్గొన్నారు.