రోడ్డు ప్రమాదంలో అక్కా,తమ్ముడు అక్కడికక్కడే మృతి

కోమటిపల్లి, గాంధీనగర్ లో అలుముకున్న విషాదఛాయలు.

జాజిరెడ్డిగూడెం ,జూన్ 6 నిజం న్యూస్

తెలిసిన వివరాల ప్రకారం… జాజిరెడ్డిగూడెం మండలం కొమటిపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్నవి. దీనితో కొమటిపల్లి గ్రామానికి చెందిన మృతుడు మాండ్ర శేఖర్(26), గాంధీనగర్ గ్రామానికి చెందిన తన అక్క పెడబోయిన రజిత(35) పండగకు స్వగ్రామానికి తీసుకెళ్లాలని ఆనందం తో బైక్ పై తీసుకొని గాంధీనగర్ నుంచి కోమటిపల్లికి ఇంటికి వెళుతుండగా, బాలెంల శివారులో సూర్యాపేట పట్టణానికి వస్తున్న టాటా ఏస్ వాహనం ఎదురుగా వచ్చి బైక్ ను ఢీకొట్టింది.

Also Read:భారతదేశంలో 4,518 కొత్త కోవిడ్-19 కేసులు

ఈ ఘటనలో అక్కాతమ్ముడు అక్కడికక్కడే మృతిచెందారు. అర గంటలో కొమటిపల్లి గ్రామానికి చెరుకునేలోపే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఒడిలోకి జారుకున్నారు. రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముళ్లు మృతిచెందడంతో గాంధీనగర్, కొమటిపల్లి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ ఆర్ సాయిరాం తెలిపారు.