లోయలోకి దూసుకెళ్లిన బస్సు

28 మంది యాత్రికులతో లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. హైదరాబాద్ బ్యూరో మే 5 (నిజం న్యూస్) ఉత్తరాఖండ్​, ఉత్తరకాశీ జిల్లాలోని డామ్టా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. యమునోత్రి రహదారిపై 28 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు 200 మీటర్ల లోతు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు.

Also Read:జామ తోట తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

సమాచారం అందుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. యాత్రికులంతా మధ్యప్రదేశ్​లోని పన్నా జిల్లాకు చెందినవారిగా పోలీసులు తెలిపారు. వారంతా యమునోత్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. 22 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు.