Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆపద్బాంధవు లారా ఆదుకోండి

ఆర్యవైశ్య
ఆపద్బాంధవు లారా ఆదుకోండి !

రేగొండ జగన్నాథం కుటుంబాన్ని ప్రతి ఆర్యవైశ్యులు ఆదుకోవాలి.

ఆర్యవైశ్యుల సహాయం అంటే మరోసారి సహాయం చేసి చూపండి.

పేద ఆర్యవైశ్యుల కోసమే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆవశ్యకత గుర్తించాలి.

సర్పంచ్ రమేష్ కు అభినందనలు.
తుంగతుర్తి జూన్ 5 నిజం న్యూస్

తెలంగాణ రాష్ట్రంలోని ఓ ఆర్యవైశ్య కుటుంబం.. ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కాలి బూడిద అయిపోయి దయనీయ స్థితిలో ప్రస్తుతం ఉన్నది… మేమున్నామంటూ రాష్ట్రంలోని ప్రతి ఆర్యవైశ్య కుటుంబం పేద ఆర్య వైశ్యునికి
సహాయ సహకారాలు మనస్ఫూర్తిగా అందించాలని కోరుకుంటూ……

పూర్తిగా కాలి బూడిద అయిపోయిన ఇల్లు ఇంట్లో నిల్వ ఉంచిన రూ.2.50 లక్షల నగదు ఆరు తులాల బంగారు ఆభరణాలు మరియు కిరాణా దుకాణంలో కిరాణ సామాన్లు అగ్నికి ఆహుతి రూ. (15) లక్షల మేర ఆస్తి నష్టం సర్వం కోల్పోయి భార్య, కొడుకు, కోడలుతో రోడ్డునపడ్డ పేద వైశ్యునికి చేయూతనివ్వండి.

Also Read:మేజర్ బాక్సాఫీస్: అడవి సేష్ సినిమాకి డే 1 ఓపెనింగ్స్

తేదీ 29-05-2022 రోజున జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలంలోని తిరుమలాపురం (పీ.డీ) గ్రామంలో రేగొండ జగన్నాథం పేద వైశ్యునికి చెందిన పెంకుటిల్లు కు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది .ఇంట్లో దాచుకున్న ఆరు తులాల బంగారు ఆభరణాలు, అప్పు చెల్లించడానికి తెచ్చిన ఇంట్లో నిల్వ ఉంచిన 2.50 లక్షల రూపాయల నగదు వీటితోపాటు ఇంట్లోని విలువైన వస్తు సామాగ్రి నిత్యావసర సరుకులు కిరాణా కొట్టులోని కిరాణా సామాన్లు మొత్తం కాలి బూడిదయ్యాయి. సుమారు (15) లక్షల మేర నష్టం వాటిల్లినట్టు రెవెన్యూ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఉదయం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లగా భార్య పూజ గదిలో పూజ ముగించుకుని వచ్చి ఇంటి ముందర కూర్చుని ఉన్నది ఈ క్రమంలో ఇంటిలో నుంచి పొగలు రావడంతో. ఇంట్లోకి వచ్చి చూడగా పూజ గదిలో ప్రమాదవశాత్తు పైన ఉన్నా వాసాల కు మంటలు అంటుకొని మంటలు చెలరేగాయి .దీంతో ఆమె భయాందోళనతో లబోదిబో మంటూ బయటికి పరిగెత్తుకొచ్చింది. చుట్టుపక్కల వాళ్లు ఇళ్లలోని మోటార్లతో మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Also Read:రాష్ట్రంలో కొత్తగా 49 కోవిడ్-19 కేసులు

సమాచారం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఎరవెని రమేష్ సంఘటనా స్థలానికి తరలి వచ్చి వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు, సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంట లను ఆర్పి వేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వారికి మన తరుపున ఆర్థిక సాయం అందచేద్దాము కావున మనసున్న మహారాజులు పెద్దమనసుతో ఆలోచించి మనవంతు కర్తవ్యంగా మనకు తోచిన చిరు సహాయంచేద్దాం. అది వారికీ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది.

వారి కుమారుడు రేగొండ శ్రీనివాస్ ఫోన్ పే , గూగుల్ పే నంబర్ 949278782. రాష్ట్రంలోని ప్రతి ఆర్యవైశ్య కుటుంబం, వారి కుటుంబానికి అండగా ఉంటున్నామని తెలియపరుస్తూ ,తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని బాధిత కుటుంబ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్యులు కోరుతున్నారు.