మద్యం మత్తులో మహిళా సర్పంచ్ పై కార్యదర్శి లైంగిక దాడికి ప్రయత్నం
ప్రతిఘటించిన సర్పంచ్ .
నడిగూడెం 1 నిజం న్యూస్
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు.
ఈలోగా సర్పంచ్ పై అట్రాసిటీ కేసు నమోదు .
మహిళ సర్పంచ్ పైన సదరు గ్రామ కార్యదర్శి లైంగిక దాడికి ప్రయత్నించిన సంఘటన మండల పరిధిలోని కరివిరాల గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది సర్పంచ్ నీలిమా గాంధీ తెలిపిన వివరాల ప్రకారం గ్రామపంచాయితీ కార్యాలయాల్లో మంగళవారం యథావిధిగా తన కార్యాలయ గదిలో కూర్చొని తన పనులు చేసుకుంటున్న సర్పంచ్ అదేరోజు మధ్యాహ్నం పన్నెండు నర గంటలకు ఎవరూ లేని సమయాల్లో సమయాల్లో గ్రామ కార్యదర్శి మద్యం మత్తులో సర్పంచ్ గదిలోకి చొరబడి నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడి దురుసుగా ప్రవర్తించి చెయ్యి పట్టుకొని లాగి లైంగిక దాడికి పాల్పడటంతో సర్పంచ్ ప్రతిఘటించి కార్యదర్శి ని గట్టిగా నెట్టివేసి కేకలు వేయటంతో కార్యదర్శి పారిపోయినట్లు తన పైన కేసును తప్పుదోవ పట్టించి తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని సర్పంచ్ కన్నీటి పర్యంతమయ్యారు .
ఇటి విషయంపై జిల్లా ఎస్పీకి నేరుగా వెళ్లి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు .
నడిగూడెం పోలీస్ స్టేషన్ కూడా సంబంధిత కేసుపై విచారణ జరపాలని నిందితునిపై ,చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసలకు తెలియజేసినట్లు పత్రికా ప్రకటనలో తెలిపారు