అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి

– చాలా బాధాకరం: కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్
వేములవాడ, మే 31 (నిజం న్యూస్):
వేములవాడ పట్టణం సుభాష్ నగర్ కు చెందిన కంటే యశ్వంత్ అమెరికాలో ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మంగళవారం పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
also read: రష్యాపై దాడి చేయడానికి అమెరికా రాకెట్లను పంపదు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు చనిపోవడం చాలా బాధాకరమని ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థి ఇలా జరగడం బాధాకరమని వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతినీ తెలియజేశారు. ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు కనికరము రాకేష్, కోయినేనీ బాలయ్య, తదితరులు ఉన్నారు