కావేరి ట్రావెల్ బస్సు బోల్తా-15 మందికి గాయాలు

వేములపల్లి సమీపంలో కావేరి ట్రావెల్ బస్సు బోల్తా
15 మందికి గాయాలు, తప్పిన ప్రాణాపాయం
మంగళవారం తెల్లవారు జామున ఘటన
వేములపల్లి మే31.(నిజంన్యూస్): నార్కట్ పల్లి అద్దంకి రహదారిపై వేములపల్లి మండలం ఎన్ ఎస్ పి కెనాల్ బ్రిడ్జి దగ్గర లో మంగళవారం తెల్లవారు జామున మూడు గంటల 15 నిమిషాల సమయంలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ ఓవర్ స్పీడ్ నిర్లక్ష్యంతో పాటు మద్యం మత్తు,నిద్రమత్తు వల్ల కావేరి ట్రావెల్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కందూకూరు జిల్లా (నెల్లూరు ) బస్సు వెళుతుంది . బస్సులో సుమారు ప్రయాణికులు 32 మంది వున్నారు. ఈ ఘటనలో 15 మందికి మామూలు గాయాలు కాగా, ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం కాలేదు. గాయాలైన వారిని మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు
వేములపల్లి ఎస్ఐ రాజు తెలిపారు.