ఫామ్ హౌస్ రోడ్డు పంచాయతీ పరిష్కరించాలని గ్రామస్తులు ధర్నా

తుర్కపల్లి, మే 30(నిజం న్యూస్ ):

ఫామ్ హౌస్ రోడ్డు పాత పద్ధతిలోనే నిర్మాణం చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామస్తులు అధికారులతో పంచాయితీ పెట్టి ధర్నా చేపట్టారు. సోమవారం కొండాపూర్ గ్రామం లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శంకరయ్య, డిప్యూటీ ఇంజనీర్ బిల్యా నాయక్, ఏ.ఈ రవికుమార్, తో గ్రామస్తులు పాత పద్ధతిలోనే రోడ్డు వెడల్పు చేపట్టాలని లేని పక్షంలో రాష్ట్ర రోకో ధర్మాలను చేపడతామని అధికారులను హెచ్చరించారు. అరువై ఆరు ఫీట్ల రోడ్డు గతంలో ఆమోదించి కూల్చివేశారు. ఇప్పుడు రోడ్లు సరిగా చేస్తామని అధికారులు ఇష్టానుసారం తో రోడ్డు వెడల్పు పేరుతో గ్రామస్తులను మోసం చేస్తున్నారని మాకు అన్యాయం జరుగుతుందని గ్రామస్తులు మాజీ సర్పంచ్ సింగం వెంకటేశం ఆరోపిస్తున్నారు. రోడ్డు వెడల్పు లో రోడ్డు మధ్యలో 33 సీట్లను కొలిచి ఇప్పుడు రోడ్డు నిర్మాణంలో గ్రామస్తులకు నష్టం జరిగేలా కొలతలు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం సరైన పరిహారం అందించడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .వెంటనే ప్రభుత్వం పాత పద్ధతిలోనే రోడ్ల నిర్మాణం చేపట్టాలని లేనిపక్షంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.