6వ ఇండో-నేపాల్ టోర్నమెంట్ కు బయల్దేరిన బచ్ పన్ ఎకడమిక్ హైట్స్ విద్యార్థులు

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో మే 30 (నిజం న్యూస్)
జాన్ 3వ తేది నుండి 5వ తేది వరకు నేపాల్ లో జరిగే 6వ ఇండో-నేపాల్ క్రికెట్ సీరీస్ కు ఎంపికైన బచ్ పన్ ఎకడమిక్ హైట్స్ విద్యార్థులను ఆ పాఠశాల ఛైర్పర్సన్ శ్రీమతి జయలక్ష్మి అభినందించారు.సోమవారము రోజున నేపాల్ కు బయలుదేరి న విద్యార్థులు మంచిగా రాణించి మన జిల్లా కు మంచి పేరు తేవాలని ఆమె ఆశీస్సులు అందించారు.ఈ కార్యక్రమంలో ఎంపికైన క్రీడాకారులు మహేందర్, లక్ష్మి హర్షిత్, హర్షవర్ధన్,నిఖిత్ మరియు పాఠశాల డైరెక్టర్ మహిపాల్ రెడ్డి ,సందీప్,శ్రీకర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.అనంతరం ఇండో-నేపాల్ ఓపెన్ క్రికెట్ సిరీస్ కు బయలుదేరిన గంగాదేవి హర్షవర్ధన్ వారికి తండ్రి మహేష్ అక్కలు హర్షిక , గీతిక,నాయనమ్మ తాత, బాబాయ్, అమ్మమ్మ తాత , మామ అత్తమ్మ లు బెస్టాఫ్ లక్ చెప్పడం జరిగింది.