ఎలిమినేటి మదుసూదన్ రెడ్డికి డాక్టరేట్ అవార్డు ప్రదానం

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో మే 30 (నిజం న్యూస్)
ఈ నెల మే 21 , 2022 , యునివర్శిటీలో పి.హెచ్.డి ఫైనల్ సెమినార్ లో స్వామి వివేకానంద ఫార్మసీ కళశాల – వంగపల్లి,యాదగిరిగుట్ట,జిల్లా యదాద్రి భువనగిరిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిమినేటి మధుసూదనరెడ్డికి ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఎస్ జె జె టి యు – రాజస్థాన్ నుండి ఫార్మసీ విభాగంలో డాక్టరేట్ ( పి.హెచ్.డి ) అవార్డు లభించింది.అతను సమర్పించిన పరిశోధన వ్యాసం “ఇవాల్యుయేషన్ ఆఫ్ న్యూరో ప్రొటెక్టీవ్ అండ్ అన్టీ అల్జీమర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ సమ్ ఇండియన్ మెడిసినల్ ప్లాంట్స్ ” యునివర్శిటీ ద్వారా ఆమోదం పొందినది.ఈ పరిశోధన 2017 లో యునివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ రాకేష్ కుమార్ జాట్,ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ హరికిరణ్ పర్యవేక్షణలో మొదలై 2022 లో సమర్పించారు.డాక్టరేట్ అవార్డు అందుకున్న సందర్బంగా కుటుంబ సభ్యులు,మిత్రులు, కళాశాల బృందం ఎలిమినేటి మదుసూదన్ రెడ్డికి అభినందనలు తెలిపారు .