సివిల్స్ లో చైతన్య రెడ్డి కి 161 ర్యాంకు పట్ల సర్వత్రా హర్షం

తుంగతుర్తి మే 30 నిజం న్యూస్
దేశంలో సివిల్స్ ఫలితాలు విడుదల కాగా తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పోలుమల్ల గ్రామానికి చెందిన బొక్క సంజీవరెడ్డి కుమార్తె, శ్రీ చైతన్య రెడ్డి, ఆలిండియా లెవల్లో 161 ర్యాంకు సాధించింది. దీనితో కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, గ్రామస్తులు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం కాలేశ్వరం లో ఏ ఈ గా పనిచేయడం గమనార్హం. మహిళల కష్టపడి చదివితే సాధించలేనిది ఏమీ లేదని మరొకమారు నిరూపించడం, గర్వించదగ్గ ది.