నా కొడుకును కొట్టి చంపిండ్రు

-నా కొడుకు అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ చేపట్టేంత వరకు న్యాయపోరాటం చేస్తా :మృతుడు రావూఫ్ తల్లి ఆజీర
పెద్దపెల్లి :మే 31: నిజం న్యూస్
ఈ నెల ఎన్టీపిసి మైనారిటీ గురుకుల పాఠశాల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధి రావూఫ్ అనుమానాస్పద మృతిపై విచారణ జరిపంచాలని రవూఫ్ తల్లి ఆజీర ప్రభుత్వాన్ని కోరింది .తన కొడుకు మరణానికి కారకులని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది . ప్రభుత్వం
స్పందించి తన కొడుకు అనుమానాస్పద మృతిపై ప్రత్యేకాధికారులతో కమిటీ వేసి విచారణ చేపట్టాలని కోరింది .మొదటి నుండి తన కొడుకు మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన పరిగణలోకి తీసుకునేవారి కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది .మే 15 రాత్రి 8:30 గంటలకి తన కొడుకు పాఠశాల భవనం పై నుండి పడ్డాడని రాత్రి 10:30 గంటలకి ఆసుపత్రిలో చేర్పించామని పాఠశాల యాజమాన్యం ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని తెలుపగా రెండు గంటల సమయం ఎందుకు వృధా చేసారని నిలదీయగా పాఠశాల యాజమాన్యం తమకు పలుమార్లు ఫోన్ చేసామాని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని బుకాయించారని తెలిపింది .
also read: లక్ష్యం పట్ల స్పష్టత ఉండాలి-ఓజో ఫౌండేషన్ అధినేత రఘు పిల్లుట్ల
కాగా రవూఫ్ తల్లి ఆజీర కి ఒకే పోన్ కాల్ వచ్చిందని నిక్కచ్చితంగా తెలిపింది .పాఠశాల ప్రిన్సిపాల్ మంచిర్యాల నుండి ఎన్టీపిసి కి వచ్చేవరకు తన కొడుకును సిక్ రూమ్ లో ఉంచి సమయం వృధాచేశారని తన కొడుకుకి వైద్యం అందకుండా చేసి తన కొడుకు మరణానికి కారణం అయ్యారని విలపించింది .తన కొడుకు దేహం తలకి గాయాలు లేవని శవానికి స్నానము చేసే సమయం లో కూడా కనిపించలేవని కంట నీరు తెచ్చుకున్నారు . ప్రమాదమే జరిగితే 108 కి కాల్ చేయకుండా ఆటో లో ఎందుకు తీసుకెళ్లార్రని ప్రశ్నించగా తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలనే ఉదేశ్యం తోనే ఆటో లో తీసుకెళ్లామని పాఠశాల యాజమాన్యం బదులిచ్చారని తెలిపింది . తొందరగా ఆసుపత్రికి ఆటో లో తీసుకెళ్లాలనే ఉదేశ్యమే ఉంటె ప్రిన్సిపాల్ మంచిర్యాల నుండి వచ్చే వరకు సిక్ రూమ్ లో తన కొడుకును ఎందుకు ఉంచారని ప్రశ్నించింది . మొదట 15 మంది విద్యార్థులు భవనం పైకి ఎక్కారని తెలిపి చివరికి నలుగురు విద్యార్థులనే చూపించారని తెలిపారు .పోలీస్ అధికారులని తమ బంధువులు భవనం పై నుండి పడితే శరీరానికి గాయాలు కాళ్ళు చేతులు విరిగిపోవా అని అనుమానం వ్యక్తం చేసి మౌఖికంగా తెలియజేసిన తలకి గాయాలు కాకపోయినా మెడ నరాలు సున్నితంగా ఉంటాయని చనిపోయే ప్రమాదం ఉండచ్చు అని బదులిచ్చారు కానీ మా అనుమానాల్ని పరిగణలోకి తీసుకోలేదని ఆరోపణ చేశారు .తమ కొడుకు అనుమానాస్పద మృతిపై ప్రత్యేకాధికారులతో కమిటీ వేసి సమగ్ర విచారణ చేపట్టాలని పాఠశాల ప్రిన్సిపాల్ నైట్ డ్యూటీ ఆఫీసర్ వార్డెన్ ని బాద్యులుగా పరిగణించి విద్యార్థులు వాచ్ మెన్ ఆటో డ్రైవర్ సమక్షం లో విచారణ చేపట్టాలని కోరింది .తన కొడుకు మృతిపై సమగ్ర విచారణ జరిపించేంతవరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని మృతుడు రావూఫ్ తల్లి ఆజీరా మేనమామలు తెలిపారు