లక్ష్యం పట్ల స్పష్టత ఉండాలి-ఓజో ఫౌండేషన్ అధినేత రఘు పిల్లుట్ల

ఓజో ఫౌండేషన్ ఉచిత శిక్షణా శిబిరంలో స్టడీ మెటీరియల్ పంపిణీ మరియు అవగాహన సదస్సు
ఐటీ కంపెనీ సీఈవో జ్యోతిరెడ్డి
లక్ష్య సాధనకు అడ్డదారులు ఉండవు
సబ్జెక్టుపై పట్టుసాధిస్తే విజయం మీదే
ఉద్యోగాలు సాధించి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్న రఘు పిల్లుట్ల
ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామనే సర్కారు ప్రకటనతో నిరుద్యోగుల ఆశలు చిగురించాయని ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్లు విడుదలవుతున్న తరుణంలో గ్రూప్స్ మరియు పోలీసు ఉద్యోగాలతో పాటు ఇతర పోటీ పరీక్షలకు అధిక ఫీజులు చెల్లించి కోచింగ్ తీసుకోలేని నిరుపేద యువత కు సర్కారి కొలువులు దక్కాలనే సంకల్పంతో శిక్షణా వ్యయాన్ని లెక్క చేయకుండా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతి యువకుల ఉపాధి కల్పనే లక్ష్యంగా ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో భాగ్యనగర్ ఇనిస్టిట్యూట్(దిల్ సుక్ నగర్, హైదరాబాద్)నందు నిష్ణాతులైన అధ్యాపకుల తో సుమారు1500 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఓజో ఫౌండేషన్ అధినేత విద్యావేత్త రఘు పిల్లుట్ల తెలియజేశారు.
ALSO READ: దేశంలోనే కళ్యాణ లక్ష్మి పథకం ఆదర్శం
ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్.ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వంటి ఉద్యోగాలకు ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఆదివారం రాత్రి భాగ్యనగర్ ఇనిస్టిట్యూట్ నందు అవగాహన సదస్సులో పాల్గొన్న ఫౌండేషన్ అధినేత రఘు పిల్లుట్ల ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేసారు.
ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒకప్పటి వ్యవసాయ కూలి నేడు అమెరికన్ ఐటీ కంపెనీ సీఈవో దూదిపాల జ్యోతిరెడ్డి మాట్లాడుతూ పోటీ పరీక్షలనగానే ప్రతి ఒక్కరిలోనూ మానసిక ఒత్తిడి కలిగి ఆందోళనకు గురవుతారని ఇలాంటి ఒత్తిళ్లను అధిగమించేందుకు సానుకూలమైన దృక్పథంతో అధ్యయనం ఆరంభించాలని సూచించారు.
పోటీ పరీక్షల కోసం సిద్ధపడేవారు ముందుగా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం పట్ల బలమైన ఆకాంక్షను కలిగి ఉండాలన్నారు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి కాబట్టి దరఖాస్తు చేస్తున్నామనే మొక్కుబడి వైఖరితో కాకుండా ఉద్యోగం తనకు తప్పనిసరి అవసరమనే విషయంపై స్పష్టత ఏర్పర్చుకొని మానసిక,శారీరక సంసిద్ధతతో పరీక్షలకు అవసరమైన కోచింగ్ మరియు మెటీరియల్ సమకూర్చుకొని ప్రిపరేషన్ ఆరంభించాలని రోజుకు ఎన్ని గంటలు చదివామనే దాని కంటే ఆరోజు చదివిన అంశాలపై మన అవగాహన ఏ స్థాయిలో ఉంది అనేది అంచనా వేసుకోవాలన్నారు. తాము తప్పకుండా విజయం సాధిస్తామనే సానుకూలమైన భావనతో అధ్యయనం మొదలు పెట్టాలని రాయబోయే పోటీపరీక్షలో తాను విజేతగా నిలవబోతున్నాననే ప్రగాఢమైన నమ్మకంతో సన్నద్ధం కావాలని జ్యోతిరెడ్డి విపులంగా వివరించారు.
ALSO READ: పెండింగ్ బిల్లులను క్లియర్ చేయండి-ఉత్తమ్
అనంతరం ఓజో ఫౌండేషన్ అధినేత రఘు మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ ప్రవేశ పరీక్షలో ర్యాంక్ సాధించి రాజేంద్రనగర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బి.ఎస్సి చదివి కాంపిటేటివ్ పరీక్షలపై తనకున్న ఆసక్తి నిరుద్యోగ యువతి యువకుల ఉపాధి కల్పనే ధ్యేయంగా ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా శిబిరాన్ని ప్రారంభించడానికి ప్రధాన కారణమని తెలిపారు.లక్ష్య సాధనకు అడ్డదారులు ఉండవని సబ్జెక్ట్ పై పట్టు సాధిస్తూ సిలబస్ మొత్తాన్ని ఆకళింపు చేసుకొని ఇష్టపడి చదివితే విజయం తప్పక వరిస్తుందని కావున యువతీ యువకులు ఇష్టంతో కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించి తనకు రిటర్న్ గిఫ్ట్ అందించాలని కోరారు. జోనల్,మల్టీ జోనల్ పోస్టుల్లోనూ అత్యధిక ఉద్యోగాలు సాధిస్తే తాము పడిన శ్రమకు ఫలితం మరియు తన ఫౌండేషన్ లక్ష్యం నెరవేరుతుందని ఆకాంక్షించారు.
గడిచిన కాలం తిరిగి రాదు కావున యువతీ యువకులు విలువైన కాలాన్ని వినియోగించుకోని తమ లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకున్నారు
ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేసిన ఉచిత కోసం స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని ఫౌండేషన్ అధినేత రఘు అభిలాషించారు.
ఈ కార్యక్రమంలో పోలీసు శాఖకు సంబంధించి సి.ఐ వెంకన్న,ఎస్.ఐ నాగరాజు, ఎస్.ఐ పవన్, ఎస్.ఐ ప్రశాంత్, సంపత్, వీరారెడ్డి, జగన్, సుధాకర్ రెడ్డి, అరవింద్, రవిశంకర్ రెడ్డి అతిథులుగా మరియు ఓజో ఫౌండేషన్ కోచింగ్ ఇంచార్జ్ కాకునూరి శివారెడ్డి,నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న, బండి అనిల్ రెడ్డి, శానం సాయినాథ్, నాగుల్ మీరా, రామాంజి గౌడ్, సతీష్, నర్సింహారెడ్డి, వినయ్, బాలసైదులు తదితరులు పాల్గొన్నారు.