దేశంలోనే కళ్యాణ లక్ష్మి పథకం ఆదర్శం

దేశంలోనే కళ్యాణ లక్ష్మి పథకం ఆదర్శం
పండుగలు తెలంగాణ సంస్కృతికి నిదర్శనం.
తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్.
తుంగతుర్తి మే 30 నిజం న్యూస్.
దేశంలోనే కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ దీపిక యుగంధర్ రావు తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ అన్నారు.
సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో 39 మందికి పంపిణీ చేసి అనంతరం మండల కేంద్రంలోని దళిత బంధు లబ్ధిదారుని తడకమళ్ల రవి చెందిన సాహితీ సూపర్ మార్కెట్ ను ప్రారంభించారు. అనంతరం కొత్త గూడెం గ్రామంలో గంగ దేవర పండుగలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పేద ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కళ్యాణ లక్ష్మి, రైతు బంధు రైతు బీమా దళిత బంధు ఆసరా పింఛన్ల వంటి పథకాలు దేశంలోనే పేరుగాంచిన మని అన్నారు. గడ్డ బందు లబ్ధిదారులు 10 లక్షల వ్యయంతో అభివృద్ధిలోకి రావాలని కోరారు. రానున్న రోజుల్లో నియోజవర్గానికి మూడు వేల ఇళ్లను మూడు లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
అవకాశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఒక్కరు అండగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కళ్లెట్ల పల్లి శోభన్ బాబు మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్, ఎంపీపీ గుండ గాని కవితా రాములు గౌడ్, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, జిల్లా రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ ఎస్ ఏ రజాక్, వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఎంపీటీసీ చెరుకు సుజనా పరమేష్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, సర్పంచులు నల్లు రాంచంద్రారెడ్డి ,యాకు నాయక్ ,ఈరోజు వెంకన్న నాయక్ చంద్ర వెంకన్న, మట్ట పెళ్లి కవిత, కటకం వెంకటేశ్వర్లు, గోపగాని రమేష్ గౌడ్, గోపగాని శ్రీను, తునికి సాయిల్ గౌడ్, తడకమళ్ల రవికుమార్, తాసిల్దార్ రామ్ ప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ పుష్ప, ఆర్ఐ మహమ్మద్ అలీ, వెంకటేశ్వర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.