Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రాజ్యసభ సభ్యుడు గా ప్రమాణస్వీకారానికి బయలుదేరిన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రీ రవి)

ఖమ్మం మే 29(నిజం న్యూస్)

టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ తో కలసి ఢిల్లీ బయలుదేరిన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి). టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశీస్సులతో ఇటీవలే రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ప్రమాణస్వీకారానికి టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావుతో కలసి కొద్దిసేపటి క్రితం శంషాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీ బయలుదేరారు.

Also Read: కేటీఆర్ దావోస్ పర్యటన హైలైట్

౩౦న ఉదయం 11:00 గంటలకు పార్లమెంట్లో రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్య నాయుడు చేత గాయత్రి రవి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటారు.