క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కట్టిన చర్యలు తప్పవు-డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న

సూర్యాపేట మే 28 నిజం న్యూస్

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మే 21 నుండి జూన్ నెల ఇరవై వరకు వరంగల్ రైతు సంఘర్షణ సభలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ లోని అంశాలను మే21 నుండి జూన్ 20 వరకు సూర్యాపేట జిల్లాలో పల్లె పల్లెలో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో శుక్రవారం నాడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
పార్టీలో నాయకులు ఎవరైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి అనుమతి తీసుకుని నిర్వహించాలని, బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల అనుమతి లేకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన‌చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జిల్లాలో డిసిసి కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కాకుండా కొందరు తమ స్వంత ఎజెండా అమలు చేస్తున్నారని, వారిపై ఇప్పటికే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పార్టీ క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశామని, అలాగే నల్గొండ పార్లమెంటు పార్టీ ఇంచార్జ్ గీతారెడ్డికి కూడ ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. టిపిసిసి అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి నియామకం జరిగిన తరువాత పిసిసి స్ధాయిలో వున్న నియామకాలు రద్దయినాయని, తిరిగి నియమించే వరకు పిసిసి పదవులు చెల్లవని ఆయన అన్నారు. కొందరు టిపిసిసి పదవులలో వున్నట్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన అన్నారు. పెన్ పహాడ్ మండలంలో మేనెల 29 న‌నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొంటారని ఆయన చెప్పారు.

ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ ఆలి, కౌన్సిలర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరు శైలేందర్, పార్టీ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు,
కోతి గోపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు తూముల సురేష్, కందాల వెంకటరెడ్డి,వీరన్న నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ చంచల‌ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.