అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్.
తుంగతుర్తి మే 28 నిజం న్యూస్
తుంగతుర్తి మండలం తుంగతుర్తి గొట్టిపర్తి గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువరు నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై నేడు తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో తడకమళ్ళ సురేష్ ,మద్దెల యాకూబ్, గాడిపెళ్లి శ్రీను, కొమ్ము ముత్తయ్య, మాచర్ల వెంకన్న, అందె మల్లేష్, రాములు, పాల్వాయి శ్రీను, మందుల కృష్ణ, చింతకుంట్ల హరికృష్ణ, గాడిపెళ్లి మాధవి, మాచర్ల కవిత, చింతకుంట్ల ఉపేంద్ర, మందుల మల్లేశ్వరి, 40 కుటుంబాలు టిఆర్ఎస్ పార్టీలోకి తిరుమలగిరిలో శనివారం ఎమ్మెల్యే నివాసములు చేరడం జరిగింది.
నూతనంగా TRS పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అన్నారు, దళిత బంధు పథకాన్ని పేద దళితులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని కోరారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తుంగతూర్తి మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, బొంకురి సురేష్, బొజ్జ సాయికిరణ్, చింతకుంట్ల విటల్ మహారాజ్, మందుల నరేష్, తదితరులు పాల్గొన్నారు.