కొండాపూర్ అంగన్వాడి టీచర్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఫిర్యాదు

తుర్కపల్లి, మే 27(నిజం న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా,తుర్కపల్లి మండలం కొండాపూర్ అంగన్వాడి టీచర్ కొన్ని పద్మ పై చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు తోటి వెంకటేశం,పల్లపు రాధా గురువారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.అంగన్వాడి సెంటర్ కు సంబంధించిన వివరాల కోసం 13.4 .2022 సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్నామని, ఇట్టి సమాచారాన్ని ఇవ్వడం లేదని, అడిగినందుకు మండల సూపర్వైజర్ అనిత ,శ్రీనివాస్ రెడ్డి, సిడిపిఓ తో కుమ్మక్కై ప్రజా ప్రతినిధులు అయిన మమ్మల్ని అవమాన పరిచారని,సమాచారం అడిగితే తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్న అంగన్వాడి టీచర్ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.