మానవత్వం చాటుకున్న తుర్కపల్లి పోలీసులు

వాహనంలో తీసుకెళ్తున్న విద్యార్థిని.

తుర్కపల్లి, మే, 27 (నిజం న్యూస్).

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రాంపూర్ గ్రామం మోడల్ స్కూల్ లో పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థి ఆకస్మికంగా ఫీట్స్ రావడంతో ఎగ్జామ్ సెంటర్ లోనే కుప్పకూలిపోయింది. 10వ తరగతి పరీక్ష బందోబస్తు వెళ్లిన ఎస్ఐ రాఘవేంద్ర గౌడ్ విద్యార్థిని గమనించి వెంటనే తమ వాహనంలో చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి అర్చన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. మండలంలో పలువురు ఎస్ ఐ ని అభినందించారు.