పూర్వ విద్యార్థుల సహకారం తో శ్రీ సరస్వతీ మాత విగ్రహం స్థాపన

వెలుగు పల్లి హై స్కూల్ లో వేదిక విగ్రహానికి, మన జన్మభూమి వెలుగు పల్లి ట్రస్ట్ తో, సుమారు మూడు లక్షల వ్యయంతో నిర్మాణ పనులు శ్రీకారం.

మన జన్మ భూమి వెలుగుపల్లి ట్రస్ట్ కన్వీనర్ ,ఈగ దయాకర్ గుప్తా.

తుంగతుర్తి ,మే 28 నిజం న్యూస్

తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శ్రీ సరస్వతీ మాత విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు పూర్వ విద్యార్థి, మన జన్మ భూమి వెలుగుపల్లి ట్రస్ట్ కన్వీనర్ ఈగా దయాకర్ గుప్తతెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వెలుగుపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల సహకారం తో మన జన్మభూమి వెలుగుపల్లి ట్రస్ట్ ను ఏర్పాటు చేసుకొని పాఠశాల లో చదువుల తల్లి శ్రీ సరస్వతీ మాత విగ్రహం స్థాపన చేయనున్నట్లు తెలిపారు, ఈ ట్రస్ట్ ద్వారా ప్రతీ సంవత్సరం 10 వ తరగతి లో 90 శాతం పైన ఉత్తిర్నులైన విద్యార్థులకు నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపారు,6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు నోట్ బుక్స్ కూడా ప్రతీ సంవత్సరం అందిస్తామని తెలిపారు, పూర్వ విద్యార్థుల సహకారం తో శ్రీ సరస్వతీ మాత విగ్రహం, వేదిక ను సుమారు 3లక్షల రూపాయల ఖర్చు తో రాజమండ్రి కి చెందిన శిల్పుల తో తయారు చేస్తున్నట్లు తెలిపారు.

, ఈ సందర్బంగా పూర్వ విద్యార్థులకు, గ్రామ పెద్దలకు, పాఠశాల ఉపాధ్యాయులకు ధన్యవాదములు తెలుపుతూ, ఆసక్తిగల దాతలు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని ప్రత్యేకంగా కోరుకున్నారు.