అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు

అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు
తుంగతుర్తి శాసన సభ్యులు డాక్టర్. గాదరి కిషోర్ కుమార్
తిరుమలగిరి మే 26 నిజం న్యూస్
తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో తిరుమలగిరి మున్సిపాలిటీ 14 వార్డు నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన చెడె రవీందర్,చెడె నరేందర్,సురేందర్,కందుకూరి గిరి,నరేష్ వారితో పాటు పలువరు నాయకులు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై గురువారం రోజున తిరుమలగిరిలోని ఎమ్మెల్యే నివాసంలో, తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది.
నూతనంగా టిఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ, కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కళ్లెట్ల పల్లి శోభన్ బాబు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘునందన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుకూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.