తానా కవి సమ్మేళనానికి ఎంపికైన కవయిత్రి రోజా దేవి

ప్రపంచంలోనే సూర్యాపేట ఖ్యాతిని పెంచిన రోజా దేవికి అభినందనల వెల్లువ.

సూర్యాపేట మే 26 నిజం న్యూస్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ” ఆజాదీకా అమృతమహోత్సవ్ “ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా “అంతర్జాతీయ
గేయ కవితల పోటీలు” నిర్వహిస్తుంది.
ఈ పోటీలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కవయిత్రి నల్లాన్ చక్రవర్తులు రోజాదేవి ఎంపికయ్యారు .మే 27,28,29 తేదీలలో జూమ్ లో తానా నిర్వహించ బోతున్న ప్రపంచ స్థాయి వేదిక మీద రోజా దేవి తమ గేయాన్ని పాడి వినిపించబోతున్నారు.
ప్రకృతి అందచందాలను వర్ణిస్తూ రాసిన ” ఎవరో మెచ్చిన దాతలు” అనే గేయం పోటీలో ఎంపికైంది.
ఇంతటి విశేషమైన కార్యక్రమం లో ఎంపిక చేసి, అంతర్జాతీయంగా పరిచయం చేస్తున్న తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు,తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వాహకులు తోటకూర ప్రసాద్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
అనేక మంది దేశ, విదేశీ కవులు, ప్రముఖులు హాజరయ్యే ఈ తానా గేయ తరంగాలు కార్యక్రమం యూట్యూబ్, ఫేస్బుక్,ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.ఈటీవీ భారత్,మన టీవి,టీవీ ఆసియా తెలుగు, ఇతర మాధ్యమాలలోప్రసారం కానుంది.వీరు
సామాజిక స్పృహ, సరళమైన భాషలో రచనలు చేసే రోజా దేవి రెండు పుస్తకాలు ముద్రించినారు.విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులుగా, లయన్స్ క్లబ్ మెంబర్ గా రాణిస్తున్నారు. జిల్లా, స్థాయిలో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
సూర్యాపేట పట్టణ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్ళిన రోజా దేవి సాహితీ వేత్తలు, ప్రముఖుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి…